కలకడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రిన్సిపల్ జయమ్మ అధ్యక్షతన నేత్రధానం యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత పై కలకడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మల్లికార్జున్ మరియు డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నేత్రధాన పక్షోత్సవాలలో భాగంగా డి. ఎమ్. హెచ్. ఓ ఆదేశాల మేరకు జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నేత్రధానం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత, ఎవరు నేత్రధానం చేయవచ్చు, ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు