వినాయక చవితి పండుగ ఉత్సవాలను జరుపుకునే గ్రామాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరు కూడా అనుమతులు తప్పకుండా తీసుకోవాలని ఎస్ఐ శ్రీనివాసులు మండల ప్రజలకు తెలిపారు. ఆదివారం పలు గ్రామాలలో నేమకల్, కుందనగుర్తి, నంచర్ల, చిప్పగిరి, తదితర గ్రామాలలో పర్యటించిన ఎస్సై ఏపీ శ్రీనివాసులు పర్యటించి ప్రజల తో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా గ్రామంలో ఎక్కడెక్కడ విగ్రహాలు ప్రతిష్ట చేస్తున్నారో వివరాలు తెలుపుతూ అర్జీ వ్రాసి చలానాను https://ganeshutsav.net/ వెబ్ సైట్ లో గాని,మీసేవ లో కట్టి అనుమతులు తీసుకోవాలని తెలిపారు.