రెబ్బెన బీసీ బాలుర వసతి గృహంలో గిరిజన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కొనసాగుతుందని DYFI జిల్లా ప్రధాన కార్యదర్శి దినకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..సరైన తరగతి లేక గురుకుల విద్యార్థులు ఇరుకుట గదుల్లో విద్యను అభ్యసిస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. గురుకుల శాశ్వత భవనం కట్టడంలో అప్పటి BRS ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమీకృత గురుకులం చేస్తుందని చెప్పిందే తప్ప చేయడం లేదన్నారు. గురుకులంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.