చేనేత నేతన్నలు రోజూ పొద్దున్నే లేచి పోగులు పోగుచేసి సంఘ గౌరవాన్ని నిలబెడతారని, అలాంటి నేతన్నల జీవితాల్లో ఉరి వేసుకునే పరిస్థితి రాకూడదని జనతా ఫౌండేషన్ అధినేత కొత్తూరు సత్యనారాయణ గుప్తా ఆకాంక్షించారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ పథకాలు చేపడుతూనే, మరోవైపు నేతన్నలు, రైతులు, కార్మికుల కోసం రక్షణాత్మక విధానాలను రూపొందించాలని సూచించారు.ఈనాటికీ నేతన్నలు చేనేత దుస్తులు తయారు చేయడానికి సాహసించలేకపోతున్నారనీ, అనేక కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల వివాహాలు కూడా జరగక భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ చేన