తమకు మురికి నీటి నుంచి విముక్తి కల్పించాలంటూ సోమవారం శ్రామిక నగర్ వాసుల ఎమ్మెల్యే సునీల్ కుమార్ వద్ద మొరపెట్టుకున్నారు. పడమర గూడూరులోని శ్రామిక నగర్లో 52 కుటుంబాలు ఉంటున్నాయని, ఆ ప్రాంతంలోని కళాశాల యాజమాన్యం కాలనీలోని మురుగు నీరు పోకుండా గోడ నిర్మించారని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.