పమిడిముక్కల మండలం వీరంకిలాకు శ్రీనివాస కళ్యాణ మండపంలో "స్త్రీ శక్తి" పథకం మహిళల మహాసభకార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్ రాజా పాల్గొన్నారు. మహిళలకు సమాజంలో పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. స్త్రీ శక్తి పథకం ద్వారా అక్కచెల్లెమ్మలు ఎంతో సంతోషంగా ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారని అన్నారు.