శుక్రవారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం లో గల గురుకుల పాఠశాలను జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు సందర్శించి అక్కడ అందుతున్న విద్యా సదుపాయాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ తో కలిసి విద్యార్థులతో మాట్లాడుతూ అందుతున్న విద్య సదుపాయాలు సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని విద్యార్థులను కోరారు మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో విద్యా ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో సభ్యులు విశ్వం బాబు ద్వారపోగు వెంకటేష్, బీరప్ప చిన్నమ్మ తామస్ తదితరులు ఉన్నారు