శ్రావణమాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సతీసమేతంగా వివిధ ఆలయాలను సందర్శించారు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పట్టణంలోని పలు ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాలలో పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు.