మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తన స్వగృహం నందు కిర్లంపూడి లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖను విడుదల చేశారు.లేఖ యొక్క సారాంశం ప్రకారం జగన్మోహనరెడ్డి తనకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే స్పందించి వైద్యులతో, హాస్పటల్ వారితో మాట్లాడి, ఎప్పటికిప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకుని ఏమన్నా కావాలా? ఏమన్నా చేయమంటారా? అని తరచూ అడిగేవారు అని, తమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు, మా కష్టకాలంలో నిలబడినందుకు ఎప్పటికి వారికి మేము ఋణపడే ఉంటామని లేఖలో పేర్కొన్నారు.