Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 27, 2025
అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ కు మళ్లీ వరద భయం. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. 326 జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్ర నుంచి ఒరిస్సా వెళ్లే ప్రయాణికులు వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చింతూరు వద్ద చీకటి వాగు, సోకులేరు వాగు రహదారిపై చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చింతూరు రెవెన్యూ పంచాయతీ పోలీస్ శాఖ వారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.చింతూరు ప్రజలు, శబరి పరివాహక ప్రాంతాల గ్రామాలు వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.