లంబాడీలు ఎస్టీలు కారు అని చెప్పడం సరైనది కాదు అని TSTTF రాష్ట్ర అధ్యక్షులు బానోత్ ఈరు నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల మీద జరుగుతున్న అసత్య ప్రచారాలు అదేవిధంగా ప్రజా ప్రతినిధులే స్వయంగా సుప్రీంకోర్టులో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని నోటీసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినందున దీనికి నిరసనగా ఖమ్మం జడ్పీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.