"ఠాగూర్ సీన్ రిపీట్ - మృతదేహానికి చికిత్స" అంటూ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలను నమ్మవద్దని, అటువంటి తప్పుడు వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఖమ్మంలోని సాయిరాం ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ జంగాల సునీల్ కుమార్ అన్నారు. ఐఎంఏ నాయకులతో కలిసి ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జంగాల సునీల్ కుమార్ మాట్లాడారు