వరద బాధితులు బియ్యం, నిత్యవసర వస్తువులను అందించాలంటూ కూనవరం మండల సీపీఎం ఆద్వర్యంలో వరదబాదితులు నిరసన ప్రదర్శన చేశారు. బుధవారం సాయత్రం ఈ మేరకు వరద బాదితులు జాలరి బజారు నుండి ర్యాలీగా టేకులబోరు తాసిల్దార్ కార్యాలయం వద్ద వరదబాదితులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వరదబాదితులు మాట్లాడుతూ తమకు నిత్యవసర సరుకులు అందక చాలా ఇబ్బందులు పడుతున్నామని, వచ్చిన ప్రతీ అధికారికి తమ గోడు చెబుతున్న పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు నిత్యవసర సరుకులు, బియ్యం అందజేయాలని డిమాండ్ చేశారు.