ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ నగేశ్, కలెక్టర్ రాజర్షిషా హాజరయ్యారు.ముందుగా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీటీడీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను సన్మానించారు.