గుంటూరు కేంద్రంగా కూటమిలో మరోసారి విభేదాలు బయటపడ్డాయనే చెప్పాలి. గురువారం సాయంత్రం గుంటూరు నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్, స్త్రీ శక్తి పథకాలపై కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమం ఫ్లెక్సీ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో తప్ప ఇతర నాయకుల ఫోటోలు ఉన్నాయి. దీంతో కార్యక్రమానికి హాజరైన బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఫ్లెక్సీ పై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసిన బిజెపి శ్రేణులు వినకుండా కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నమని తేల్చి చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు.