కడప జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లి, తురకపల్లి గ్రామాలలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి సరస్వతి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు క్షేత్రస్థాయిలో ఉల్లి మినుము పంటలను పరిశీలించారు.జిప్సం, జింక్ సల్ఫేట్ కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారి,డిఆర్సి సుచిత్ర రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. భూసార పరీక్షల ఆధారంగా సిఫారసుల మేరకు ఎరువులను వాడాలని తెలిపారు. పచ్చి రొట్టె,ఎరువుల ప్రాముఖ్యతను, పలు పంటలలో సస్యరక్షణ చర్యలను గూర్చి వివరించారు.