పద్మనాభం మండలం రేవడి సమీపంలో స్ప్రింగ్ ఫీల్డ్ ప్రైవేట్ పాఠశాల బస్సుకు సోమవారం పెను ప్రమాదం తప్పింది. బస్సు రన్నింగ్లో ఉండగా స్టీరింగ్ బోల్ట్ బయటకు ఊడిపోయి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించాడు. బస్సులో 25 మంది విద్యార్థులు ఉండగా పలువురుకి స్వల్పగాయాలయినట్లు సమాచారం. మరో 5 నిమిషాల్లో పాఠశాలకు చేరుకునే లోపే ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.