గోదావరి ప్రవాహంలో గల్లంతైన కపిలేశ్వరపురం మండలం, కేదార్లంక గ్రామ పంచాయితీ వీధివారి లంకకు చెందిన చిట్టియ్య (65) కోసం రెవిన్యూ సిబ్బంది పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిట్టియ్య తాతపూడి లంక వెళ్లగా ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో సమీపంలో గోదావరిలో పడి గల్లంతై ఉండవచ్చునని కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం ఎస్డీఆర్ఎఫ్ టీం సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.