ద్వారకాతిరుమలలోని రాణిచిన్నయమ్మారావు పేటలో వీధి కుక్కలు గురువారం ఒక బాలికపై దాడికి ప్రయత్నించాయి. పాఠశాలకు వెళ్తున్న సమయంలో అవి వెంట పడడంతో, బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఇంటి బయటే ఉన్న ఆమె తల్లి వెంటనే అప్రమత్తమై బాలికను దగ్గరకు తీసుకుంది. దాంతో ఆ కుక్కలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇటీవల చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. దాంతో ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.