చిత్రహింసలు పెడుతున్నారంటూ తన భార్య, కుమారుడిపై సన్నీల వెంకన్న అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తనను భార్య, కుమారుడు కలిసి వేధిస్తున్నారని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న తనను శుక్రవారం కరీంనగర్ బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయారని వాపోయాడు. ప్రయాణికుల సహాయంతో హుస్నాబాద్ కు చేరుకొని పోలీస్ స్టేషన్ లో భార్య, కుమారుడిపై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. కుమారుడు రాజేష్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్నాడని తెలిపారు.