వీణవంక: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి పై సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ లలో టిఆర్ఎస్ నాయకులు చరణ్ రావు కిషన్ రెడ్డి కామెడీ శ్రీనివాస్ రెడ్డి అనే వారు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుచిత పోస్టులు పెడుతూ మండలంలో రెండు పార్టీల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ గొడవలు జరిగే విధంగా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బుధవారం రాత్రి వీణవంక పోలీస్ స్టేషన్లో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బావు రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు