ఆదోని మండలంలో వారం రోజుల క్రితం జరిగిన పెద్ద పెండేకల్ గ్రామంలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడిన ఈరమ్మ గురువారం ఉదయం కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మనవడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్యాస్ ఏజెన్సీ అధికారులు కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై గ్రామ పెద్దలు అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో గ్యాస్ వినియోగంపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు.