ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మారేడుబాకలో గురువారం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. పట్టణంలో 16,926, మండలంలో 25,901 కార్డులు కలిపి మొత్తం 42,827 కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోవిందరాజు, తహశీల్దార్ తేజేశ్వరరావు పాల్గొన్నారు.