కౌటాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఆదివారం గణేష్ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నవరాత్రులు పూజలు అందుకున్న ఘనపయ్యను సమీపంలోని చెరువులో నిమజ్జనం చేసినట్లు ప్రత్యేక అధికారి పవిత్ర తెలియజేశారు,