ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొనదుల రమేశ్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇడుపులపాయలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో జగన్తో కలిసి పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ను శాలువాతో సత్కరించారు. తాడిపత్రిలోని పరిస్థితులను వివరించారు. అనంతరం వైఎస్సార్కు నివాళి అర్పించారు.