ఏజెన్సీ లో గిరిజన ప్రజలకు మంచి సేవలు అందించిన ఏ అధికారికైనా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని రంపచోడవరం ఐటీడీఏ నూతన ప్రాజెక్ట్ అధికారి స్వరణ్ రాజ్ పేర్కొన్నారు.గురువారం ఐటీడీఏ సమావేశపు హాలులో బదిలీపై వెళ్తున్న ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి నూతన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం వారికి గజమాలతో నూతన ప్రాజెక్ట్ అధికారి సన్మానించారు.