యాదాద్రి భువనగిరి జిల్లా: వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం పై భువనగిరిలో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాసదస్సును నిర్వహించారు.దివ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ సదస్సులో విజయాలు వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై చర్చించారు.సిపిఎం పాలిటిబ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధరైతంగా పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తుందన్నారు.బిజెపి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు జిల్లా సిపిఎం కార్యదర్శి ఎండి జహంగీర్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అనురాధ పాల్గొన్నారు.