శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని మూలపల్లి కి చెందిన భాస్కర్ అనే వ్యక్తి తన కుమార్తె మౌనికతో కలిసి కదిరి పట్టణంలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. పని ముగించుకొని తిరిగి వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అతడి కుమార్తె అదృశ్యమైంది. దీనిపై అతడు కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అమీన్ నగర్ కు చెందిన దేవా అనే యువకుడు వారి స్నేహితుల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.