ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉట్నూర్ కు చెందిన 25 ఏళ్ల మౌనిక ఆదిలాబాద్ లోని ఓ ఫుట్ వేర్ షాప్ లో ఉద్యోగం చేస్తూ భుక్తాపూర్ కాలనిలో అద్దె గదిలో నివాసం ఉంటోంది. కాగా మంగళవారం విధులు నిర్వహించిన అనంతరం గదికి వచ్చి ఉరేసుకుంది. ఇరుగుపొరుగు వారు గమనించడంతో విషయం బయటకు తెలిసింది. మృతదేహాన్ని రిమ్స్ తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది