ఫర్టిలైజర్ షాపు యజమాని నిర్లక్ష్యం వల్ల ఓ రైతు కొంపముంచింది. రెబ్బెనకి చెందిన విజయ్ అనే రైతు శుక్రవారం ASF పట్టణంలోని ఓ ఫర్టిలైజర్ షాపులో వరిలో కలుపు నివారణ మందు అడిగితే..పత్తి కలుపు నివారణ మందు ఇచ్చిండ్రు. నాలుగు ఎకరాల వరిపంటకు మందును పిచికారి చేశారు. దీంతో వరి పంట నష్టం జరుగుతుందని. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతు షాపు ఎదుట ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక షాపు యజమాని మాత్రం పత్తి కలుపు నివారణ మందు అని రైతు చెప్పే ఇచ్చామని తెలుపుతున్నారు.