కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం స్పందించారు. నీటి గుంతలో పడి శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్ అనే చిన్నారులు మృతిచెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు గల బాలలు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.