బెజ్జూరు మండలంలోని గేర్రెగూడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలు ఏర్పడి బురద మయంగా మారడంతో వాహనదారులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్లప్పుడు వచ్చే నాయకులు పొంతన లేని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు పరచడం లేదని స్థానిక నాయకులపై గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు,