మచిలీపట్నం లో జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి కేసులో నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు కలెక్టర్ బాలాజీ ని నిలదీశారు. దాడి జరిగి నెలలు గడిచినా నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, కేసు దర్యాప్తు వేగవంతం అయ్యేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు.