ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని హెల్త్ కమ్యూనిటీ సెంటర్ ను టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మారుతున్న వాతావరణం కారణంగా జ్వరాలతో బాధపడుతున్న ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న పలువురిని ఆమె స్వయంగా వైద్యం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్ పరిసరాలను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రభుత్వ హస్పటల్ లో అందుబాటులో ఉంటూ వైద్యం చేస్తారని ఆమె అన్నారు.