సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని మోమిన్ మహల్లాలో విద్యార్థి అదృశ్యం అయినట్లు పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. మోమిన్ మొహల్లాకు చెందిన మహమ్మద్ అర్బాజ్ అహ్మద్ అనే విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నాడన్నారు. ఈనెల 12న రాత్రి 7:30 సమయంలో ఇంట్లో నుండి కూరగాయల మార్కెట్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని, బంధువుల వద్ద తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభ్యం కాలేదని అతడి అన్న ముబిన్ శనివారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.