నందిగామ వీరులపాడు (M) జయంతిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశా పాల్గొని ముందుగా మొక్కలు నాటారు. వర్మీ కంపోస్ట్, మెడికల్ స్టాల్స్ను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ ఆంధ్ర దిశగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇళ్ల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే గ్రామాలు బాగుంటాయని చెప్పారు. 2047 నాటికి స్వచ్ఛాంధ్ర సాధించడమే లక్ష్యమన్నారు.