అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6- సూపర్ హిట్ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రసంగిస్తూ... 1994 నుంచి నేటి వరకు 13 డిఎస్సీలు నిర్వహించడం జరిగిందన్నారు. వీటి ద్వారా 1,24, 200 మందికి ఉపాధ్యాయుల ఉద్యోగం లభించిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ విద్యాశాఖ మంత్రి లోకేష్ 16,348 నందిని టీచర్లుగా తీర్చిదిద్దడానికి సిద్ధమయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని ఇది నిదర్శనమని పేర్కొన్నారు.