నిన్న, మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా రేటు ఒక్కసారిగా పడిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం పత్తికొండ,ప్యాపిలి మార్కెట్లలో కిలో రూ.4 నుంచి రూ.6 మాత్రమే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు పొలాల్లోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.30కి అమ్ముతున్నారు.