అద్వానంగా మారిన వంతడుపుల-నారెడ్డిపల్లె రోడ్డు..ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామం నుండి నారెడ్డి పల్లె వరకు ఉన్న రోడ్డు అధ్వనంగా మారింది.అడుగుకో గుంతతో, చినుకు పడితే ఎక్కడ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొన్నటి వర్షానికి రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో ఆ రోడ్డు గుండా వెళ్లాలంటేనే నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల కేంద్రానికి వచ్చే ఆటోలు, స్కూల్ వ్యాన్ లు కూడా రావడం లేదు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం ల