అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ లో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా సంగప్ప అనే వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం. సంఘపకు కాలు విరగడంతో హుటా హుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాజా హోటల్ వద్ద సరుకులు తీసుకుని రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.