సంతమాగులూరు లోని ఎమ్మార్వో కార్యాలయం నందు సోమవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో యూరియా ను ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఖాదర్ బాషా పాల్గొని మాట్లాడారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించడానికి అరికట్టాలని అన్నారు. మండలంలో యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక రైతులకు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు.