అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగాన్ని శనివారం రాత్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల పనితీరును ఆయన పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు లక్ష్యంగా వైద్యులు తమ పనితీరు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన చికిత్సలు అందించాలని సూచించారు.