కోసిగిలో బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు నర్సారెడ్డి, యంకన్న, నాగిరెడ్డిలపై వైసీపీ కార్యకర్తలు వేట కొడవలి, ఇనుపరాడుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. పొలం నుంచి ఇంటికి వస్తున్న వీరిని అడ్డగించి, 'మీరు టీడీపీ నాయకుల ఫొటోలు, వీడియోలు స్టేటస్ లో పెట్టుకుంటారా' అని ప్రశ్నిస్తూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు గుర్తించి కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సారెడ్డి తల, చేతిపై వేట కొడవలితో దాడి చేయడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.