అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి పత్తిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేశారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. పత్తిపై సుంకాన్ని తగ్గించడం వల్ల దేశ వ్యాప్తంగా పత్తి ధరలు తగ్గి పత్తి పండించే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.