స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ విద్యాసాగర్ ఆదివారం తెలిపారు. సెప్టెంబర్ 1న బాలబాలికలకు వాలీబాల్, 2న బాలురకు ఖోఖో, కబడ్డీ, 3న బాలికలకు ఖోఖో, కబడ్డీ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అండర్-14, 17 విభాగాల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు.