వికారాబాద్ జిల్లా కేంద్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం వెంకటేశ్వర స్వామి దేవాలయం, తోట్ల ఎల్లమ్మ మహాలక్ష్మి దేవాలయం తో పాటు, మారుతి నగర్ వైభవలక్ష్మి దేవాలయంలో ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య సతీమణి తదితరులు పాల్గొని ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.