జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ లో దక్షిణ ఎక్స్ప్రెస్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఏర్పాటు కృషి చేసిన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ కృష్ణారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం నుండి అనేకమంది వ్యాపారాల కోసం హైదరాబాదు ఢిల్లీ ప్రాంతాలకు నిత్యం ప్రయాణం చేస్తుంటారని వారి కోరిక మేరకు దక్షిణ ఎక్స్ప్రెస్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హాల్టింగు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున పట్టణ ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల వాళ్ళు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.