కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో బుధవారం జాతీయ సేవా పథకం 3, 4 యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. లలిత, డా యస్. సునీత ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొపెసర్ పద్మ మాట్లాడుతూ, మార్కులు రాకపోవడం, ప్రేమ వైఫల్యం, కుటుంబ కలహాలు, సర్దుబాటు లేకపోవడం వంటి కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం దేశానికి తీరని నష్టమని, ఇది అత్యంత కఠినమైన నిర్ణయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు.