కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీను ఉద్దేశించి కావ్య కృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కావ్య పై సెటైర్లు వేశారు. బుధవారం ఉదయం 11 గంటలకి వారు వీడియోని మీడియాకు విడుదల చేశారు.