తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని రామచంద్రపురం లో నిరసన కార్యక్రమం చేపట్టారు. దివ్యాంగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో రామచంద్రపురంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో అనేకమంది దివ్యాంగులు మానసిక వేదన అనుభవిస్తున్నారని రాజు పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో అఖిల కు వినతిపత్రం అందజేశారు.